News August 11, 2025

నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌పైనే హైడ్రాకి ఫిర్యాదులు

image

వ‌ర్షాల వేళ నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 51 ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా అద‌న‌పు క‌మిష‌న‌ర్ అశోక్ కుమార్ తెలిపారు. ఫిర్యాదుల‌ను ప‌రిశీలించిన ఆయన అందులో 70 శాతం వ‌ర‌కూ నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌పైనే ఉన్నాయన్నారు. సంబంధిత అధికారుల‌కు వాటి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

Similar News

News March 11, 2026

TG గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం

image

నేడు 11.30 గంటలకు HYDలోని లోక్ భవన్‌లో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎస్, మంత్రులు తదితరులు హాజరవుతారు.

News March 11, 2026

HYD: వాట్సాప్‌లో కాస్ట్, ఇన్‌కమ్, GHMC సర్టిఫికెట్లు!

image

HYDలో కాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్, EBC, OBC మ్యారేజ్, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం నిత్యం రద్దీగా ఉండే ‘మీసేవా’ల చుట్టూ తిరుగుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. GOVT తీసుకొచ్చిన మీ సేవా ఈ వాట్సాప్ <<8096958096>>8096958096<<>> నంబర్‌ సేవ్ చేసుకొని Hi పంపండి. వెంబడే సర్టిఫకెట్ల లిస్ట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్లన్నీ అప్లై చేసుకోవచ్చు. 7రోజుల ప్రాసెసింగ్ టైమ్. సమ్మర్ తర్వాత కాలేజీకి వెళ్లేవారికి యూజ్ అవుతుంది.
# SHARE IT

News March 11, 2026

HYDలో డైనోసార్ ఆనవాళ్లు.. చూద్దాం రండి!

image

HYDలోని డాక్టర్ విలియం కింగ్ జియోలాజికల్ మ్యూజియం భూగర్భ అద్భుతాల ప్రదర్శనశాలగా నిలుస్తోంది. GSI ఆధ్వర్యంలోని ఈ మ్యూజియంలో డైనోసార్ శిలాజాలు, అరుదైన ఖనిజాలు భౌగోళిక చరిత్రను చూపిస్తున్నాయి. భూమి పుట్టుక, ఖండాల ఏర్పాటుపై మ్యూజియంలో వివరణాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భౌగోళిక శాస్త్రంపై ఆసక్తి పెంచేలా సమాచారం, నమూనాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఇది భూగర్భ శాస్త్ర అధ్యయనానికి కేంద్రంగా నిలుస్తోంది.