News April 27, 2024
నాలుగు రోజుల్లో 8 మంది మృతి

జాతీయ రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే సూర్యాపేట జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. ఈనెల 21న మునగాల మండలం ముకుందాపురం ప్రమాదంలో దంపతులు, గురువారం కోదాడ పరిధిలోని శ్రీరంగపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
Similar News
News April 14, 2026
ఏడేళ్ల తర్వాత ‘ఇంటి పన్ను’ లెక్కలు షురూ!

జిల్లాలో గ్రామ పంచాయతీల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంటి పన్నుల పునఃమదింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2018లో చివరిసారిగా జరిగిన ఈ ప్రక్రియ, మళ్లీ ఇప్పుడు పట్టాలెక్కుతోంది. ఇండ్ల కొలతలు, నిర్మాణాల్లో మార్పులు, కొత్తగా నిర్మించిన భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. 849 పంచాయతీల్లో ఈ ప్రక్రియ ద్వారా అదనంగా సుమారు రూ.2 కోట్లు ఆదాయం రానున్నది.
News April 14, 2026
NLG: డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీకి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని NLGలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ శ్రీనివాసరాజు, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News April 14, 2026
ఎంజీయూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల విడుదల

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 113 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. గతంలో వీరికి సంబంధించిన ఏజెన్సీ సుమారు 99 లక్షల రూపాయల జీఎస్టీ బకాయి పడటంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో స్తంభించిన వేతనాల చెల్లింపునకు ప్రత్యామ్నాయంగా మరో ఏజెన్సీ ద్వారా నిధులు విడుదల చేస్తూ వర్సిటీ యంత్రాంగం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.


