News April 22, 2024
నా గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు: కిషన్ రెడ్డి

కొందరు ప్రశ్నించినంత మాత్రాన ఆ పార్టీలకు జవాబు చెప్పే అవసరం లేదని ప్రజలకు, మీడియాకే చెప్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే రాలేని వారు మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి వారసిగూడలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సీతాఫల్ మండి మీదుగా జీప్ ప్రచార యాత్రను కిషన్ రెడ్డి చేపట్టారు.
Similar News
News December 6, 2025
HYDలో పెరుగుతున్న ‘ఫబ్బింగ్’ కల్చర్!

సిటీలో సామాజిక విలువలు పడిపోవడానికి ‘ఫబ్బింగ్’ కారణం అవుతోంది. చుట్టూ అందరూ ఉన్నా వారిని పట్టించుకోకుండా స్క్రీన్ చూడటం, మెసేజ్‌లు చెక్ చేయడం, ఫోన్‌కే అతుక్కోవడాన్ని ఫబ్బింగ్ అంటారు. ఇది అవతలి వ్యక్తికి గౌరవం లేదన్న భావన కలిగిస్తుంది. ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. బంధాలను నిలబెట్టాలంటే ఈ డిజిటల్ ద్రోహాన్ని ఆపాలి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరు ఫబ్బింగ్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్: రూ.250 లక్షల కోట్లే లక్ష్యం!

భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కేవలం పెట్టుబడుల సమావేశం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక విధానాల విప్లవం. 2047 నాటికి $3 ట్రిలియన్ (సుమారు ₹250 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ దిశగా ముఖ్యమంత్రి ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ సారాంశమే ఈ సమ్మిట్. తయారీ, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పటిష్ఠమైన, స్థిరమైన నూతన పాలసీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
News December 6, 2025
HYD: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో విమానాల వరుస రద్దులతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరంగా ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్‌లు జత చేస్తూ ప్రయాణికుల రద్దీని తగ్గించే చర్యలు ప్రారంభించింది. దక్షిణ, తూర్పు, ఉత్తర, పశ్చిమ సహా పలురైల్వే జోన్లు మొత్తం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు అమర్చి.. వచ్చే 10వ తేదీ వరకు ప్రయాణానికి ప్రత్యామ్నాయ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి.


