News January 16, 2025
నా చుట్టూ తిరిగితే పదవులు రావు: నారా లోకేశ్

నారావారిపల్లెలో బుధవారం ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చుట్టూ తిరిగితే పదవులు రావని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు. నాయకుల పనితీరుపై వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. పొలిట్‌బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30 శాతం కొత్తవారు రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు.
Similar News
News February 13, 2025
చిత్తూరు: ‘బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు’

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తుల గడువు పెంచినట్లు పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం దరఖాస్తులు ఈ నెల 15 లోపు అప్లై చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
News February 13, 2025
చిత్తూరు నేతలకు కీలక పదవులు ఇచ్చిన జగన్

చిత్తూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా కే.పీ. శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే చిత్తూరు రూరల్ అధ్యక్షుడిగా జయపాల్, గుడిపాల మండల అధ్యక్షుడిగా జై ప్రకాశ్‌ని నియమించారు. తమకు అవకాశం కల్పించిన జగన్, విజయనందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.
News February 12, 2025
బైరెడ్డిపల్లి: మహిళపై అత్యాచారయత్నం

బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.