News March 26, 2024

నా బాస్‌ KCR ఒక్కరే: పద్మారావు

image

సికింద్రాబాద్‌లో గెలవబోతున్నామని BRS MP అభ్యర్థి పద్మారావు జోస్యం చెప్పారు. తెలంగాణభవన్‌లో జరిగిన పార్లమెంటరీ సమావేశంలో‌ ఆయన మాట్లాడారు. ‘అప్పట్లో నా వద్ద బండి లేదు. కార్పొరేటర్‌ నుంచి పార్లమెంట్‌ స్థాయికి ఎదిగాను. నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుంచే రాజకీయాలు మొదలయ్యాయి. నా బాస్ KCR ఒక్కరే. ఆయన వల్లే రాజకీయాల్లోకి వచ్చాను. ఈ MP ఎన్నికల్లోనూ గెలుస్తాను’ అంటూ పద్మారావు ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News February 10, 2026

పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు.. HYDలో ఖాళీలు ఇవే..!

image

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. HYD డివిజన్ పరిధిలో డాక్ సేవక్-7, HYD సోర్టింగ్ డివిజన్లో డాక్ సేవక్- 23 పోస్టులు ఉన్నాయి. HYD సౌత్ ఈస్ట్ పరిధిలో డాక్ సేవక్-22, ABPM-9, BPM-10, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో డాక్ సేవక్-12, ABPM-4, BPM-8 పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్ indiapostgdsonline.cept.gov.inలో అప్లై చేసుకోండి.

News February 10, 2026

HYDలో 2 రోజులు వాటర్ బంద్

image

ఆర్సీపురం, అశోక్‌నగర్‌, జ్యోతినగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం, మదీనాగూడ, మియాపూర్‌, బీరంగూడ, అమీన్‌పూర్‌, భాగ్యనగర్‌ కాలనీ, ఆఫ్‌ టేక్‌ పాయింట్స్‌, బల్క్‌ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, కేపీహెచ్‌బీకాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్‌కాలనీ, ప్రగతినగర్‌‌కు నీటి సరఫరా ఉండదు. మంజీరా ఫేజ్- 2 మరమ్మతుల కారణంగా బుధవారం ఉ.6 నుంచి గురువారం రాత్రి 10 గం. వరకు వాటర్ నిలిచిపోతుంది.

News February 10, 2026

HYD: 10th విద్యార్థినికి తాళి కట్టిన సార్

image

10వ తరగతి విద్యార్థినికి ఓ టీచర్ తాళి కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచేసింది. ఘట్కేసర్ పరిధి పోచారంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌ టీచర్ మైటీన్(27) విద్యార్థినికి మాయమాటలు చెప్పి చాటుగా తాళి కట్టాడు. JAN 3 గమనించిన తల్లి, కుమార్తెను నిలదీయగా విషయం చెప్పింది. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా.. స్కూల్‌కి సంబంధం లేదనటంతో బాధితులు పోచారం PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు.