News January 11, 2026

నిఖత్ జరీన్‌కు గోల్డ్ మెడల్

image

గ్రేటర్ నోయిడాలో (UP) జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మహ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్స్‌ సాధించారు. 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్.. 2023 ప్రపంచ ఛాంపియన్ నితూ ఘాంగాస్‌ను ఓడించి తన మూడో నేషనల్ టైటిల్‌ను గెలుచుకున్నారు. మరోవైపు హుసాముద్దీన్ 60KGల విభాగంలో సచిన్ సివాచ్‌పై విజయం సాధించారు. 75KGల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ సైతం గోల్డ్ మెడల్ సాధించారు.

Similar News

News January 12, 2026

వరంగల్: BRSలోకి తక్కలపల్లి రవీందర్ రావు

image

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు ఈరోజు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా చేరారు. అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావును కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించి, కాంగ్రెస్ అవినీతికి చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.

News January 12, 2026

Gen Zలో ఎంతో క్రియేటివిటీ: మోదీ

image

Gen Z క్రియేటివిటీతో నిండి ఉందని PM మోదీ అన్నారు. వినూత్న ఆలోచనలు, ఉత్సాహంతో జాతి నిర్మాణంలో యువశక్తి ముందంజలో ఉందని చెప్పారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో ఆయన మాట్లాడారు. యువతను దృష్టిలో పెట్టుకొని వరుసగా పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. దీంతో దేశంలో స్టార్టప్ విప్లవం ఊపందుకుందన్నారు. కల్చర్, కంటెంట్, క్రియేటివిటీతో కూడిన ఆరెంజ్ ఎకానమీలో దేశం అద్భుత వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు.

News January 12, 2026

ALERT: ఈ కోడ్స్‌తో కాల్స్ చేయొద్దు!

image

సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్‌కు తెరలేపారు. డెలివరీ ఏజెంట్లమని చెబుతూ USSD కోడ్‌లతో కాల్స్ చేయించి యూజర్ల OTPలు తమకు వచ్చేలా చేస్తున్నారు. తర్వాత ఆయా ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్నారు. 21, 61, 67 వంటి USSD కోడ్‌లతో మొదలయ్యే నంబర్లకు డయల్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిందని భావిస్తే ##002#కి డయల్ చేసి డీయాక్టివేట్ చేయాలని చెబుతున్నారు.