News October 7, 2025
నిజాంసాగర్: 5 గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఉదయం 32,820 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 5 వరద గేట్లను ఎత్తి 32,820 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను, ప్రస్తుతం ప్రాజెక్టులో 17.802 టీఎంసీలతో నిండుకుండలా మారింది.
Similar News
News January 19, 2026
నల్గొండ: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వివరించారు.
News January 19, 2026
గంటా 45 నిమిషాల మీటింగ్ కోసం 6 గంటల ప్రయాణం.. ఏదో ఉంది?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ UAE అధ్యక్షుడు అల్ నహ్యాన్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం గంటా 45 నిమిషాల కోసం ఆయన ఆరు గంటలు ప్రయాణించడం గమనార్హం. ఇరాన్ కల్లోలం, సౌదీ-UAE మధ్య యెమెన్ చిచ్చు, గాజా శాంతి చర్చల వంటి ఇష్యూస్ నేపథ్యంలో ఫోన్లో కాకుండా నేరుగా చర్చించేంత బలమైన విషయమేదో ఉందని దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారత్‌ను బలమైన భాగస్వామిగా UAE నమ్ముతోంది.
News January 19, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, BRS నేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉ.11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని అందులో పేర్కొంది. హరీశ్ పాత్రపై ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ మేరకు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో BRS కీలక నేతకు నోటీసులు రావడం సంచలనంగా మారింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా? అనేది ఆసక్తిగా మారింది.


