News June 21, 2024
నిజామాబాద్: ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులను ఎక్కించుకొని వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం నలుగురు విద్యార్థులు ఉన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని స్థానికులు వెల్లడిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 15, 2026
NZB: మున్సిపల్ రిజర్వేషన్లు ఇలా..

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా STకి ఒకే ఒక్క స్థానం దక్కింది.
1.నిజామాబాద్ కార్పొరేషన్- ST(G)-1, SC(G)-3, W-2, BC(G)-12, W-12 UR(G)-14, W-16
2.బోధన్- ST(G)-1, SC(G)-2, W-1 BC(G)-8, W-7 UR(G)8-, W-11
3.ఆర్మూర్- ST(G)-1, SC(G)-2 W-1, BC(G)-7, W-7 UR(G)-8, W-10
4.బీమ్‌గల్- ST(G)-1, SC(G)-1 W-1, BC(G)-2, W-1 UR(G)-2, W-4
News January 14, 2026
NZB: మత్తు మందు ఇచ్చి దొంగతనం.. ముఠా అరెస్ట్

వ్యాపారం పేరిట మాయమాటలు చెప్పి, మత్తు మందు కలిపిన బీరు ఇచ్చి నగలు దొంగిలించిన ముఠాను నిజామాబాద్ టౌన్-4 పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రసాద్, నర్సింగరావు, రుద్రా యాదవ్ అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల్లో వీరు పలు నేరాలకు పాల్పడినట్లు ఎస్హెచ్ఓ సతీశ్ కుమార్ తెలిపారు.
News January 14, 2026
నిజామాబాద్: ఆర్టీసీ స్పెషల్ వసూళ్లు !

సంక్రాంతి నేపథ్యంలో నిజామాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోల నుంచి వివిధ రూట్లల్లో 500 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుండగా గ్రామీణా ప్రాంతాలకు వెళ్లే బస్సులు తగ్గడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లేవారి నుంచి స్పెషల్ పేరిట అదనంగా 50 శాతం పసూళ్లు చేస్తోందని, పండగపూట ఆర్టీసీ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


