News March 24, 2024
నిజామాబాద్: ఈతకు వెళ్లి యువకుడు మృతి

జగిత్యాల మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ధర్మోరకు చెందిన శివకుమార్ (19) తన మిత్రుడి బర్త్ డేకు చిట్టాపూర్ వెళ్లాడు. తన మిత్రులతో కలిసి శనివారం గ్రామశివారు చెరువు వద్ద గల బావిలోకి ఈతకు వెళ్లాడు. శివకుమార్‌కు ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News December 14, 2025
చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా చర్యలు: NZB CP

సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్ లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
News December 14, 2025
నిజామాబాద్: వామ్మో చలి.. మూడు రోజులుగా వణుకు పుట్టిస్తోంది

గత మూడు రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం నుంచి మొదలైన చలి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పంజా విసురుతోంది. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎండలో నిలబడి ఉపశమనం పొందుతున్నారు. కొందరు ఇళ్లలోనే మంట కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత వల్ల చాలామంది సర్ది, దగ్గు, జ్వరాల బారిన పడి కొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
News December 14, 2025
NZB: 1,476 పోలింగ్ కేంద్రాలు.. 61 వెబ్ క్యాస్టింగ్ కేంద్రాలు

నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఆదివారం రెండో విడుత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తం పోలింగ్ కేంద్రాలు-1,476, పీవోలు-1,476, ఓపీవోలు-1,937, సిబ్బంది తరలింపునకు రూట్లు-53, మైక్రో అబ్జర్వర్లు-56, జోనల్ అధికారులు-34, వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు-61ను సిద్ధం చేశారు. ఉదయం 7 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 2 గం. నుంచి ప్రారంభం అవుతుంది.


