News March 28, 2024
నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డి నేపథ్యమిదే!

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డిని ఆపార్టీ అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. ఈయన 1983లో TDP నుంచి తొలిసారిగా జగిత్యాల MLAగా ఎన్నికై.. మంత్రివర్గంలో చేరారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరి 1989, 1996, 1999, 2004, 2014లలో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలిచారు. 2019లో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ MLCగా ఎన్నికయ్యారు.
Similar News
News February 17, 2026
KNR: ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్

కొత్తపల్లి మండలంలోని చింతకుంట, మల్కాపూర్ డీసీఎంఎస్ ఎరువుల దుకాణాలు, గోదాములను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకాలు మరియు నిల్వల రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. యూరియా కొనుగోలుకు వచ్చిన రైతులతో మాట్లాడి, బుకింగ్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News February 17, 2026
కరీంనగర్ ‘నగరాధిపత్యం’ కమలం వశం!

కరీంనగర్ మున్సిపల్ పోరులో బీజేపీ ఉత్కంఠ విజయం సాధించింది. మేయర్ ఎన్నికలో బీఆర్ఎస్ తటస్థంగా ఉండటంతో, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. బండి సంజయ్ వ్యూహంతో కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా పీఠమెక్కారు. దశాబ్ద కాలం నగరాన్ని ఏలిన గులాబీ పార్టీ కేవలం 9 స్థానాలకే పరిమితమై ఉనికి కోసం పోరాడుతోంది. ప్రస్తుతం జిల్లా రాజకీయం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే హోరాహోరీగా సాగుతోంది.
News February 17, 2026
కరీంనగర్‌లో రేపు జాబ్ మేళా

నిరుద్యోగ యువతీయువకులకు రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్లోని గోదావరిఖని బైపాస్ రోడ్డు కేబుల్ వంతెన సమీపంలోగల ఓ కంపెనీలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. టీమ్ లీడర్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఆఫీసర్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ సహా మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వివరాలకు కాల్- 9908230384.


