News September 11, 2025
నిజామాబాద్: కుక్కర్ పేలి మధ్యాహ్న భోజన కార్మికురాలికి గాయాలు

అమ్రాద్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు లలితకు తీవ్రగాయాలు అయ్యాయి. స్కూల్లో వంట చేస్తున్న సమయంలో కుక్కర్ పేలింది. దీంతో ఆమెను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌తో చర్చించారు.
Similar News
News December 11, 2025
కామారెడ్డి జిల్లాలో 5 ఓట్ల తేడాతో తొలి విజయం

బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భాగ్యమ్మ విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి లక్ష్మీపై ఐదు ఓట్ల తేడాతో భాగ్యమ్మ విజయం సాధించారు. దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. సర్పంచ్ స్థానం కోసం పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రచారం కొనసాగింది. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు.
News December 11, 2025
నిజామాబాద్‌లో పోలింగ్ శాతం ఎంత అంటే?

తొలి దశ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన మధ్యాహ్నం1 గంట వరకు 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. బోధన్ మండలంలో 84.88%, చందూరు-79.95%, కోటగిరి-78.05%, మోస్రా-76.09%, పొతంగల్- 82.21%, రెంజల్- 80.91%, రుద్రూరు-84.05%, సాలూర-85.91%, వర్ని-78.74%, ఎడపల్లి-67.11%, నవీపేట-76.78% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News December 11, 2025
NZB: వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్న సీపీ

మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని CC కెమెరా ద్వారా కమాండ్ కంట్రోల్ హల్‌లోని వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ బూత్‌లోని సరళిని CP సాయి చైతన్య పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.


