News April 28, 2024
నిజామాబాద్: గర్భిణి మృతి.. బంధువుల ఆందోళన

నిజామాబాద్ కాలూర్‌కు చెందిన నాలుగు నెలల గర్భిణి మృతి చెందడంతో వైద్యులే కారణమంటూ నగరంలోని వీక్లీ మార్కెట్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బంధువులు ఆదివారం ఆందోళన చేపట్టారు. శనివారం ఆసుపత్రికి తీసుకువచ్చిన గర్భిణిని ఆసుపత్రి వైద్యురాలి సూచన మేరకు స్కానింగ్ చేయించగా డాక్టర్ కడుపులో బిడ్డ చనిపోయిందని అబార్షన్ అవసరం లేదని కొన్ని టాబ్లెట్లు వాడాలని సూచించారు. అయితే ఇవాళ ఆమె మృతి చెందడంతో ఆందోళన చేశారు.
Similar News
News April 16, 2026
NZB: మీ సేవ కేంద్రాల అక్రమాలపై ACB కొరడా

రాష్ట్రవ్యాప్తంగా పలు మీ సేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) కొరడా ఝుళిపించింది. బుధవారం నిజామాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 13 మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా మీ సేవ నిర్వాహకులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.
News April 16, 2026
NZB: ఆ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు స్పందించాలి: కవిత

తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ సమాజానికి జరిగిన అవమానమని అన్నారు. ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అంటూ వారిని ప్రశ్నించారు. వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తేజస్వీ సూర్యతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రాంత ఎంపీలుగా కొనసాగే అర్హత మీకు లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
News April 16, 2026
NZB: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నరనే సమాచారంతో దాడి చేసినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడిలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న న్యాలం శ్రీనివాస్, పాపి భూదేవితో పాటు ఒక విటుడిని, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు SHO వివరించారు.


