News June 19, 2024
నిజామాబాద్: చెప్పేదొకటి.. చేసేదొకటి!

జిల్లాలో చాలా ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఖలీల్‌వాడిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆర్థో పేరిట రిజిస్ట్రేషన్ అయింది. అక్కడ జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, స్త్రీ వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. ద్వారకానగర్‌లో ఒక జనరల్ ఫిజిషియన్‌గా అనుమతి తీసుకుని సర్జన్లు సైతం నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ 394 ఆసుపత్రులు అనుమతులు పొందగా.. 122 అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి.
Similar News
News January 24, 2026
కమ్మర్‌పల్లి: ఫొటోగ్రఫీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగాధర్

కమ్మర్‌పల్లికి చెందిన లుక్క గంగాధర్ ఫొటో అండ్ వీడియోగ్రఫీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫొటోగ్రాఫర్ల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని గంగాధర్ పేర్కొన్నారు. ఆయన నియామకంపై స్థానిక ఫొటోగ్రాఫర్లు హర్షం వ్యక్తం చేశారు.
News January 24, 2026
NZB: రేపు అండర్-16 వాలీబాల్ ఎంపికలు

నిజామాబాద్ నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో ఆదివారం అండర్-16 జిల్లా స్థాయి వాలీబాల్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్ గౌడ్ తెలిపారు. ఆసక్తి గల బాలబాలికలు తమ ఆధార్ కార్డు, 10వ తరగతి సర్టిఫికెట్‌తో రేపు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.
News January 24, 2026
NZB: మున్సిపల్ ఎన్నికలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు పూర్తి బాధ్యతతో, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అన్ని ఏర్పాట్లతో ముందస్తుగానే సిద్ధంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు.


