News March 27, 2024

నిజామాబాద్ జిల్లాలో కుష్ఠి వ్యాధి విస్తరిస్తోంది..!

image

ఉమ్మడి జిల్లాలో కుష్ఠి వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. NZBజిల్లాలో గతేడాది సెప్టెంబరులో చేపట్టిన సర్వేలో 214 మంది అనుమానితులను గుర్తించి 15 మందిలో వ్యాధిని గుర్తించారు. తాజాగా జరిగిన సర్వేలో 462 మందిని అనుమానితులను గుర్తించగా వీరికి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంది. 6నెలల్లోనే అనుమానితుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా వ్యాధిని నివారణకు జిల్లా వైద్యాశాఖ చర్యలు చేపట్టింది.

Similar News

News February 13, 2026

ఆర్మూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా

image

ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 36 వార్డులకు 19 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీని సాధించడంతో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ​కాంగ్రెస్: 19 వార్డులు
​బీజేపీ: 7 వార్డులు
​బీఆర్ఎస్: 5 వార్డులు
​ఇతరులు/స్వతంత్రులు: 4 వార్డులు
​MIM: 1
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గ చూపారు.

News February 13, 2026

BREAKING: బోధన్ మున్సిపాలిటీలో హంగ్

image

ఉత్కంఠభరితంగా సాగిన బోధన్ మున్సిపాలిటీ కౌంటింగ్‌లో చివరకు హంగ్ ఏర్పడింది. మొత్తం 38 వార్డుల్లో 17 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేయగా 12 స్థానాల్లో MIM, BJP 3, BRS 5 స్థానాల్లో గెలిచాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్‌ సంఖ్య 20కి ఎవరూ చేరుకోకపోవడంతో హంగ్ నెలకొంది.

News February 13, 2026

భీంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు: TPCCచీఫ్

image

భీంగల్ మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ విజయం ప్రజల ఆశయాల గెలుపు అని పేర్కొంటూ భీంగల్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.