News May 7, 2025
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.. శుక్రవారం మెండోరాలో 45.3℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వేల్పూర్ 45℃, నిజామాబాద్ 44.9, ముప్కాల్ 44.9, ఆర్మూర్ 44.7, నందిపేట, ఏర్గట్ల 44.5, మాగ్గిడి, ఎడపల్లి, బాల్కొండ 44.4, మక్లూర్, కమ్మర్పల్లి, మోస్రా 44.3, లక్మాపూర్, ఇస్సాపల్లి 44.2, జక్రాన్‌పల్లి 44.1, తొండకూర్ 44, పాల్దా, చిన్నమావంది, గోపన్నపల్లి, నవీపేట్ 44, రెంజల్లో 43.8℃గా నమోదైంది.
Similar News
News February 12, 2026
నిజామాబాద్: వార్ వన్ సైడ్… లేక హంగ్..?

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీజేపీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొత్తం 60 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 30కి చాలా దగ్గర బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు 20కి అటు ఇటుగా, MIMకు 10కి పైబడి డివిజన్లు వచ్చే అవకాశం ఉందని, అయితే మేయర్ ఎన్నిక నాటికి ఎక్స్‌అఫీషియో ఓట్లు, ఇతర సమీకరణాలు కీలకమవుతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
News February 12, 2026
NZB: పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతంలో ఓటేశారు

నిజామాబాద్ కార్పొరేషన్ సహా ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు చైతన్యం చాటారు. పురుషుల ఓటింగ్ శాతం 60.86% కాగా, మహిళలు 62.87% పోలింగ్‌తో పైచేయి సాధించారు. మొత్తం 2,57,020 మంది మహిళా ఓటర్లలో 1,61,597 మంది ఓటు వేయగా.. 2,38,418 మంది పురుషుల్లో కేవలం 1,45,098 మంది మాత్రమే ఓటేశారు. పురుషుల కంటే మహిళలే ఓటింగ్ నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు.
News February 12, 2026
14న ఆర్మూర్ ఆర్టీసీ కార్గోలో వేలం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిల్ సర్వీస్‌లో మిగిలిన పాత వస్తువులకు ఈనెల 14న శుక్రవారం వేలం పాట నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లోని బస్ పాస్ కౌంటర్ వద్ద వేలంపాట జరుగుతుందని డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు పాల్గొని అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని సూచించారు.


