News October 3, 2024

నిడదవోలులో రేపు జాబ్ మేళా

image

నిడదవోలు ఎస్వీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తూ.గో.జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జాబ్ మేళా మొదలవుతుందని, 5 కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. SSC, డిప్లొమా, డీఫార్మసీ, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ ఎం-ఫార్మసీ చదివిన 19-30 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులన్నారు.

Similar News

News November 7, 2024

తూ.గో: 4,02,331 ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్

image

తూ.గో.జిల్లాలో దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్‌లను పొందేందుకు 4,02,331 బుకింగ్స్ అవ్వగా వాటిలో 3,59,462 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమహేంద్రవరంలో తెలిపారు. మొదటి గ్యాస్ సిలిండర్ను లబ్ధిదారులు పొందేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అవకాశం ఉందన్నారు. లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

News November 7, 2024

ప్రత్తిపాడు: బాలిక అదృశ్యంపై హోంమంత్రి ఆరా

image

గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన నూకరత్నం కుమార్తె ఓ కళాశాలలో చదువుతూ గత నెల 22న అదృశ్యమైంది. తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. లేఖలో పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఎస్పీ విక్రాంత్ పాటిల్‌‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రత్యేక బృందాలతో బాలిక ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. ఆమె ‘x’ వేదికగా స్పందించారు.

News November 7, 2024

రాజమండ్రి ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం

image

రాజమండ్రి ఎయిర్పోర్టులో బుల్లెట్లు కలకలం రేపాయి. రాజమండ్రి టు హైదరాబాద్‌కు వెళ్తున్న ప్యాసింజర్ బ్యాగ్‌ను పోలీసులు ఈ రోజు ఉదయం తనిఖీ చేయగా ఆరు బుల్లెట్లు లభ్యమయ్యాయి. ప్రయాణికుడు ఎయిర్ పోర్టు నిబంధనలు పాటించకపోవడంతో అతడిపై చర్యలకు సిద్ధం అయ్యారు. ఎయిర్ పోర్ట్ నిబంధనలు మేరకు ప్రయాణికులు నడుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.