News March 28, 2024
నిడమర్రు: వాహన తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదు సీజ్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో బుధవారం పలు చోట్ల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఉంగుటూరు మండలం బువ్వనపల్లి చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ1.75 లక్షలు నగదు సీజ్ చేసినట్లు నిడమర్రు ఎస్సై ఆర్.శ్రీను చెప్పారు. బువ్వనపల్లి సత్యనారాయణపురంలో ఎటువంటి పత్రాలు లేకుండా కారులో రూ.1.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News February 13, 2026
వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలి: కలెక్టర్

ప.గో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు.
News February 12, 2026
పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో పీఎం శ్రీ, మనబడి మన భవిష్యత్తు పథకాల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సమీక్షించారు. విద్యా, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మాట్లాడిన ఆమె.. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
News February 12, 2026
భీమవరం: స్టేషన్ రికార్డుల నిర్వహణపై ఐజీ ఆకస్మిక తనిఖీ

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా ఐజీ అశోక్ కుమార్ పరిపాలన, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా మహిళా రక్షణ, పోక్సో, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు తీరును విశ్లేషించారు. నేరాల నియంత్రణకు రాత్రిపూట గస్తీని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.


