News August 20, 2025

‘నిన్ను పెళ్లి చేసుకోను.. కావాలంటే చచ్చిపో’

image

టేకులపల్లిలో <<17459372>>యువతి <<>>సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ‘నువ్వు బీటెక్ చదువుతున్న మరో అబ్బాయితో చాట్ చేస్తున్నావ్. నిన్ను పెళ్లి చేసుకోను. ఏం చేసుకుంటావో చేసుకో.. కావాలంటే చచ్చిపో’ అని బానోత్ బిచ్చా కాల్స్, చాటింగ్ ద్వారా తులికశ్రీని అనుమానించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆమె 13న పురుగు మందు తాగింది. హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది.

Similar News

News January 15, 2026

20 నుంచి కేయూ దూరవిద్య ఎమ్మెస్సీ పరీక్షలు

image

కేయూ పరిధిలోని దూరవిద్య కేంద్రం(సీడీఓఈ) ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రీవియస్, ఫైనలియర్ విద్యార్థులకు ఈ నెల 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ప్రీవియస్ పరీక్షలు ఈ నెల 20, 22, 24, 27 తేదీల్లో జరుగుతాయి. ఫైనలియర్ పరీక్షలు 20, 22, 24, 27, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.

News January 15, 2026

బంగ్లా క్రికెట్‌లో తిరుగుబాటు: బోర్డు డైరెక్టర్ రాజీనామాకు డిమాండ్!

image

BCB డైరెక్టర్ నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్‌లో చిచ్చు రేపాయి. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటే ఆటగాళ్లకు నష్టపరిహారం చెల్లించబోమని అనడంపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వివాదం ముదరడంతో స్పందించిన బోర్డు, ఆ వ్యాఖ్యలు తమ అధికారిక వైఖరి కాదంటూ విచారం వ్యక్తం చేసింది.

News January 15, 2026

సూర్యాపేటలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

image

1.సూర్యాపేట 48: ST 4, SC 7, BC 13, UR 24.
2.తిరుమలగిరి 15: ST 1, SC 3, BC 3, UR 8.
3.కోదాడ 35: ST 2, SC 5, BC 10, UR 18.
4. హుజూర్‌నగర్ 28: ST 1, SC 4, BC 9, UR 14.
5.నేరేడుచర్ల 15: ST 1, SC 3, BC 3, UR 8.