News December 1, 2025
నిపుణులతో తరగతుల నిర్వహణ: దీపక్ తివారి

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా విద్యాధికారి దీపక్ తివారి సూచించారు. సోమవారం ASF జిల్లా కలెక్టరేట్‌లో పీఎం శ్రీ పాఠశాలల హెచ్ఎమ్‌లతో సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
MBNR: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్

మహబూబ్‌నగర్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి కుమార్ జిల్లా మేనేజర్ ఉదయ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులకు లేదా సిబ్బందికి ఏదైనా అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ సేవలను వినియోగించుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
News February 13, 2026
మక్తల్: 22 ఏళ్లకే కౌన్సిలర్‌గా శైవి రెడ్డి

మక్తల్ 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బి.శైవి రెడ్డి (22) సంచలన విజయం సాధించారు. ప్రత్యర్థిపై 321 ఓట్ల మెజార్టీతో గెలిచి, మున్సిపాలిటీలోనే అతి పిన్న వయస్కురాలైన కౌన్సిలర్‌గా గుర్తింపు పొందారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు ఘనంగా అభినందనలు తెలిపాయి.
News February 13, 2026
శివ నామాలు అర్థాలు ‘‘నీల లోహిత’’

సృష్టి ఆరంభంలో బ్రహ్మ దేవుడి కోపం నుంచి శివుడు ఉద్భవించినప్పుడు ఆయన ‘నీల లోహిత’ రూపంలో ఉన్నాడు. ‘నీల’ అంటే ఆకాశం అంతటి నీలి రంగు, ‘లోహిత’ అంటే అగ్ని లాంటి ఎరుపు రంగు. అంటే సృష్టిలోని శాంతిని, అలాగే ప్రళయ కాలంలోని తీవ్రతను రెండింటినీ ఆయన తనలో కలిగి ఉంటారని దీని అర్థం. అర్ధనారీశ్వర రూపానికి ఇది మరో సంకేతం. నీలం రంగు జ్ఞానానికి చిహ్నం అయితే, ఎరుపు రంగు శక్తికి, క్రియాశీలతకు నిదర్శనం.


