News August 22, 2025

నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నిమజ్జన సమయాలలో ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా నదుల్లో నీరు అధికంగా ప్రవహిస్తోందని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జేసీ హరికిరణ్ పాల్గొన్నారు.

Similar News

News January 18, 2026

రంగారెడ్డి జిల్లాలో మహిళలకు 62 స్థానాలు

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉన్నాయి. వీటిలో ఆమనగల్లులో 15, చేవెళ్లలో 18, ఇబ్రహీంపట్నంలో 24, మొయినాబాద్‌లో 26, షాద్‌నగర్‌లో 28, శంకర్‌పల్లిలో 15 వార్డులు ఉన్నాయి. వీటిలో ST మహిళ, SC మహిళ, BC మహిళ, అన్‌రిజర్వ్‌డ్ మహిళలకు 62 స్థానాలు దక్కాయి. ఆమనగల్లులో 7, చేవెళ్లలో 9, ఇబ్రహీంపట్నంలో 12, మొయినాబాద్‌లో 13, షాద్‌నగర్‌లో 14, శంకర్‌పల్లిలో 7వార్డులు మహిళలకు కేటాయించారు.

News January 18, 2026

NLG: మారిన రిజర్వేషన్లు.. డివిజన్ల కోసం సెర్చింగ్!

image

NLG కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్‌లు మారిపోయాయి. తాము పోటీచేసిన స్థానంలో అనుకూలమైన రిజర్వేషన్ కాకుండా మహిళలకు వచ్చిన స్థానాలు ఉన్నాయి. అలాంటి చోట్ల తమ సతీమణులను బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నారు. NLG కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ గతంలో పోటీ చేసి గెలిచిన స్థానాల్లో ఈ సారి రిజర్వేషన్లు మారిపోయాయి. దీంతో తమకు అనుకూలమైన డివిజన్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

News January 18, 2026

నిర్మల్: యువకుడి సూసైడ్

image

పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. SI వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం ఎర్వచింతల్‌‌కు చెందిన సాయికుమార్(24) దుబాయ్‌లో రెండేళ్లు పని చేసి 3 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం తండ్రిని బైక్ అడగగా ఆయన ఇవ్వలేదు. కోపంతో పురుగు మందు తాగాడు. నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.