News February 26, 2025

నిమ్మనపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

ఒడిశా రాష్ట్రానికి చెందిన పొదన్, దీపక్‌లు ఎగువ మాచిరెడ్డిగారిపల్లె వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. బుధవారం ఇటుకుల బట్టి నుంచి ఇటుకులను లోడ్ చేసుకుని బోయకొండ వద్ద అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ పరారు కాగా, పొదన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై తిప్పేస్వామి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు.

Similar News

News February 27, 2025

BREAKING: అస్సాంలో భూకంపం

image

వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా మంగళవారం కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో, బుధవారం ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది.

News February 27, 2025

అనుకోకుండా గెలవలేదు.. అలవాటు చేసుకున్నారు: సచిన్

image

CTలో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించిన అఫ్గాన్ టీమ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారు అనుకోకుండా గెలిచారని ఇకపై ఎవరూ భావించొద్దన్నారు. అఫ్గాన్ కుర్రాళ్లు గెలుపులను అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన జద్రాన్, 5 వికెట్లు తీసిన ఒమర్‌జాయ్‌ని ప్రత్యేకంగా అభినందించారు.

News February 27, 2025

ADBలో ఆంక్షలు.. 144 సెక్షన్ అమలు: SP

image

ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNNS యాక్ట్ (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. 100-200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించడానికి చూసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా తిరగడం, పార్టీ జెండాలను పార్టీ గుర్తులను ధరించకూడదని హెచ్చరించారు.

error: Content is protected !!