News October 5, 2025

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ..!

image

నిరుద్యోగ గ్రామీణ యువకులకు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణ సంస్థ ఉచిత శిక్షణ ఇస్తుంది. అసిస్టెంట్ బుక్ కీపర్, ఫోటో, వీడియోగ్రఫీ, ఏసీ మెకానిక్ కోర్సులకు శిక్షణ అందజేస్తుంది. ఉమ్మడి ఖమ్మంలోని ఆసక్తి గల అభ్యర్థులు ఖమ్మం తరుణి హాట్‌లో 9వ తేదీలోపు అప్లై చేసుకోవాలని డైరెక్టర్ కోరారు. ఉచిత శిక్షణతో పాటు వసతి, యూనిఫామ్స్ అందజేస్తామన్నారు. వివరాలకు 9573369281, 6301438045 సంప్రదించాలన్నారు.

Similar News

News January 17, 2026

నవ గ్రహాలు వాటి ప్రత్యధి దేవతలు

image

ఆదిత్యుడు – రుద్రుడు
చంద్రుడు – గౌరి
అంగారకుడు – క్షేత్రపాలకుడు
బుధుడు – నారాయణుడు
గురు – ఇంద్రుడు
శుక్రుడు – ఇంద్రుడు
శని – ప్రజాపతి
రాహువు – పాము
కేతువు – బ్రహ్మ

News January 17, 2026

BECILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 3పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి PG (జెనిటిక్స్, హ్యూమన్ జీనోమిక్స్, కౌన్సెలింగ్/లైఫ్ సైన్సెస్), MSc/MTech (బయోఇన్ఫర్మాటిక్స్/జీనోమిక్స్, మైక్రో బయాలజీ), PhDతో పాటు పనిఅనుభవం గలవారు JAN 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.becil.com

News January 17, 2026

నందిగామ Y జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

image

నందిగామ వై-జంక్షన్ వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి సెలవులు ముగియడం, ఆదివారం అమావాస్య కావడంతో ప్రయాణికులు ముందుగానే HYD బాట పట్టారు. వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో పోలీసులు తాత్కాలిక ఫ్లైఓవర్ ద్వారా రాకపోకలకు అనుమతించినా ఫలితం లేకపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.