News October 4, 2025

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం: మంత్రి సుభాష్

image

రామచంద్రపురం నియోజకవర్గ నిరుద్యోగ యువకులకు BS6, BS7 బైక్ రిపేర్‌పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వసతి గృహం వద్ద 30 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. నూరు శాతం హాజరు కలిగిన అభ్యర్థులకు అధునాతన టూల్‌కిట్‌ అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Similar News

News January 23, 2026

బాపట్ల జిల్లా మీదుగా దూసుకెళ్తుంది.!

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు బాపట్ల మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

News January 23, 2026

నేడు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

image

AP: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఇవాళ ప్లాట్లు కేటాయించేందుకు CRDA ఏర్పాట్లు చేసింది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఇ-లాటరీ ద్వారా అందజేయనుంది. మొత్తం 15 గ్రామాల్లోని 291 మందికి స్థలాలు ఇవ్వనుంది. 14 గ్రామాల రైతులకు 11AMకు, ఉండవల్లిలో మెట్టభూములిచ్చిన వారికి 3PMకు కేటాయించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చిన, ఉండవల్లిలో జరీబు భూములిచ్చిన రైతులకు త్వరలో ప్లాట్లు ఇవ్వనుంది.

News January 23, 2026

విజయవాడ: ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకుని మోసం

image

మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రీస్తురాజుపురానికి చెందిన చెందిన ఓ బాలిక(15)ను అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడు. ఈ ఘటనపై తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు వసంత్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు మాచవరం సీఐ వెంకటరమణ గురువారం తెలిపారు.