News August 11, 2025
నిర్మల్‌లో జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు

జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్ బాలికల ఎంపిక పోటీలు నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం నిర్వహించారు. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ADBలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు రవీందర్‌గౌడ్, రమణరావు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ అన్నపూర్ణ, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News March 9, 2026
భారత్ డామినేషన్.. 3 ఏళ్లలో 6 WCలు

గత 3 ఏళ్లలో భారత్ 6 క్రికెట్ వరల్డ్ కప్‌లు గెలిచింది. 2024 మెన్స్ టీ20 WC, 2025 ఉమెన్స్ U19 WC, 2025 ఉమెన్స్ ODI WC, 2025 బ్లైండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్, 2026 మెన్స్ అండర్-19 WCతో పాటు తాజాగా మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. అన్ని జట్లను అభినందించారు. ఇది ఇండియన్ క్రికెట్‌కు గోల్డెన్ ఎరా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News March 9, 2026
మా దేశ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరం: ఇరాన్ FM

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికలో విదేశీయుల ప్రమేయం అవసరం లేదని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడంలో తాము సాయం చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘మా దేశ వ్యవహారాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వం. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ లీడర్‌ను నిర్ణయిస్తుంది’ అని చెప్పారు. కాగా కొత్త నాయకుడిగా మొజ్తాబా ఎన్నికైనట్లు వార్తలొస్తున్నాయి.
News March 9, 2026
గంభీర్.. ఒక్క ఫైనల్‌లోనూ ఓడలేదు

గౌతమ్ గంభీర్ ఇప్పటివరకూ ఒక్క ICC ఫైనల్ కూడా ఓడలేదు. భారత ప్లేయర్‌గా 2007 T20 WC, 2011 ODI WC, హెడ్ కోచ్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ(2025), టీ20 WC(2026) సాధించారు. ప్లేయర్‌గా 2010 ఆసియా కప్ కూడా గెలిచారు. అలాగే IPLలో KKRకి కెప్టెన్‌గా 2, మెంటార్‌గా ఒక టైటిల్ అందించారు. కోచ్‌గా జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేస్తున్నారని ఆయనపై విమర్శలొచ్చాయి. కానీ ఆ మార్పులే ఇప్పుడు విజయాన్ని కట్టబెట్టాయి.


