News August 11, 2025

నిర్మల్: ‘అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలి’

image

అంగన్వాడీ ఆయాలుగా 5 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వారికి టీచర్స్‌గా ప్రమోషన్‌ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌కు అంగన్వాడీ యూనియన్‌ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హత ఉన్న ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఇందులో యూనియన్‌ నాయకులు శైలజ, లావణ్య, రమ్య, భాగ్య, స్వరూప, చందన, లత ఉన్నారు.

Similar News

News March 13, 2026

BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ఉగాది కానుకగా PM కిసాన్‌తోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో 46.85 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో రూ.6 వేల చొప్పున జమ చేశారు. వీటిలో పీఎం కిసాన్ నిధులు రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలున్నాయి. మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <>క్లిక్<<>> చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకోండి.

News March 13, 2026

ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతుందా?.. డాక్టర్లు ఏమన్నారంటే!

image

మద్యం తాగితే త్వరగా నిద్ర పడుతుందని చాలామంది భావిస్తారు. కానీ అది ఒక పెద్ద భ్రమ అంటున్నారు వైద్యులు. ‘ఆల్కహాల్ వల్ల గాఢ నిద్ర తగ్గి, రాత్రివేళ తరచూ మెలకువ వస్తుంది. దీంతో మెదడుకు విశ్రాంతి ఉండదు. గురక & స్లీప్ అప్నియా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఉదయం లేవగానే నీరసంగా, అలసటగా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర కోసం మద్యానికి దూరంగా ఉండటమే బెటర్’ అని సూచిస్తున్నారు. SHARE IT

News March 13, 2026

తిరుపతిలో 16న జాబ్ మేళా.. 650 జాబ్స్

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌ (MCC)లో 16వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 650 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.