News October 5, 2025
నిర్మల్: ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి రద్దు

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ప్రజావాణి నిలిపివేస్తున్నామని, కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్
సూచించారు.
Similar News
News January 14, 2026
అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించేందుకు AI టూల్: MH సీఎం

అక్రమ బంగ్లాదేశీయుల అంశం ప్రధాన సమస్య అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. వారిని గుర్తించేందుకు IIT బాంబేతో కలిసి AI టూల్‌ను తాము అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్క్ కొనసాగుతోందని, AI టూల్ సక్సెస్ రేటు 60 శాతంగా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా ముంబైకి వచ్చిన బంగ్లా పౌరులను పంపించేందుకు డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు.
News January 14, 2026
సంగారెడ్డి: అంగన్‌వాడీలకు విద్యుదీకరణ, మరమ్మతులు

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ, మరమ్మతులపై కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలకు తక్షణమే కనెక్షన్లు ఇవ్వాలని, భవనాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు విద్యుత్, సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
News January 14, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజాబాబు

సంక్రాంతి పండగ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను అందరిని కలుసుకొని కను విందులు చేసే అందరి పండగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంట చేతికి వచ్చే కాలమని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు.


