News November 7, 2025
నిర్మల్: కార్డులు సరే.. పథకాలు ఏవి?

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా మారింది కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాలో 29,386 కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే రేషన్ కార్డుదారులు బియ్యం పంపిణీ మినహా ఇతర ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు. ప్రజాపాలన వెబ్ సైట్‌లో కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఆప్షన్ లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
Similar News
News January 16, 2026
HYD: రోడ్డుపై బండి ఆగిందా? కాల్ చేయండి

HYD- విజయవాడ హైవే పై వెళ్తుంటే మీ బండి ఆగిపోయిందా? వెంటనే 1033కి కాల్ చేయండి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోతే అందజేస్తారు. దానికి తగిన ధర చెల్లించాలి. టైర్‌పంచర్ అయితే ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ సేవలు 24Hrs అందుబాటులో ఉంటాయి. కుటుంబంతో హ్యాపీగా వెళ్తుంటే కార్ ఆగిపోతే ఆ బాధ వర్ణణాతీతం. అందుకే ఈ నం. సేవ్ చేసుకోండి.. అవసరమవుతుంది.
# SHARE IT
News January 16, 2026
లీకేజీ సుడిగుండంలో HYD అగ్రీ వర్సిటీ..!

రాష్ట్రంలో ఏకైక అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరున్న రాజేంద్రనగర్ ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రశ్నపత్రాల లీకేజీ సుడిగుండంలో చుట్టుకుంది. లీకేజీ కేసులో నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేయగా, 35 మంది అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేశారు. 2014, 2024 మధ్య పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో అనేక అవకతవకలు జరిగినట్లు వైస్ ఛాన్స్‌లర్ ఆల్దాస్ జానయ్య తెలిపారు.
News January 16, 2026
225 పోస్టులకు నోటిఫికేషన్

<


