News April 10, 2025

నిర్మల్: కొడుకు పట్టించుకోవడం లేదని SPకి ఫిర్యాదు

image

కంటికి రెప్పలా కాపాడుకొని పెంచిన పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అలాగే కాపాడుకోవాలి. కానీ కన్న కొడుకే తమను ఇబ్బంది పెడుతున్నాడని ఓ వృద్ధ దంపతులు SP ఆఫీస్ మెట్లెక్కారు. దిలావర్పూర్‌కు చెందిన నర్సయ్య తన ఆస్తిని పెద్ద కుమారుడి పేరు మీద రాశాడు. ఆపై తమను మనోవేదనకు గురి చేస్తున్నాడని SP జానకి షర్మిలకు ఫిర్యాదు చేశారు. ఆస్తులు కోసం తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసిన ఘటనలు తరుచూ చూస్తునే ఉన్నాం.

Similar News

News January 21, 2026

పగిలిన గుడ్లు తక్కువ ధరకే.. తింటే ఇబ్బందులు

image

పగిలిన గుడ్లను షాపుల్లో తక్కువ ధరకే విక్రయించడం తెలిసిందేగా. కాస్త పగిలిందనో, కేవలం పగుళ్లే కదా అని తీసుకెళ్లి వండుకుంటున్నారా? అయితే మీరు అనారోగ్యానికి గురికావచ్చు. ఎగ్ పెంకు పగిలిందంటే లోపలికి బ్యాక్టీరియా వెళ్లి పాడవుతాయి. చూసేందుకు, వాసన మామూలుగా ఉన్నా లోపల క్రిములు డెవలప్ అవుతాయి. కాబట్టి తక్కువ ధరకే వస్తుందని వాటిని తింటే విరేచనాలు మొదలు ఒక్కోసారి తీవ్ర అస్వస్థతకు గురికావచ్చు.
Share It

News January 21, 2026

పులిగుండాల ఎకో టూరిజం కేంద్రాభివృద్ధిపై సమీక్ష

image

ఖమ్మం జిల్లాలో ప్రకృతి పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న పులిగుండాల ఎకో టూరిజం కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, కల్లూరు సబ్ కలెక్టర్ పులిగుండాల సందర్శించి సమీక్ష నిర్వహించారు. సందర్శకుల భద్రత, వసతులు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమీక్షించారు.

News January 21, 2026

పెద్దపల్లి: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో DWSM విభాగంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తూ, ప్రతి గ్రామానికి నీరు అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.