News August 21, 2025

నిర్మల్: గణేశ్ ఉత్సవాలపై అదనపు కలెక్టర్ సమీక్ష

image

నిర్మల్ జిల్లాలోని వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ కోరారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఏఎస్పీ రాజేశ్ మీనాతో కలిసి ఆయన సమీక్షించారు. గణేశ్ విగ్రహాల ప్రతిష్టాపన, నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని గణేశ్ మండపం నుంచి వినాయక్ సాగర్ వరకు నిమజ్జన రూట్‌మ్యాప్‌ను వారు పరిశీలించారు.

Similar News

News January 15, 2026

యోగాసన పోటీల్లో మెదక్ క్రీడాకారుల ప్రతిభ

image

అస్మిత సౌత్ జోన్ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో మెదక్ జిల్లా చేగుంటకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాచారం డీపీఎస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 350 మందికి పైగా పాల్గొన్నారు. రిత్మిక్ పెయిర్ విభాగంలో సైనీ శిరీష, చిక్కుల మనోజ నాలుగో స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందారు. వారు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ అస్మిత యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు.

News January 15, 2026

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

image

<>ఇర్కాన్ <<>>ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ 32 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 19 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు . నెలకు జీతం రూ.60 వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ircon.org

News January 15, 2026

ఇంద్రవెల్లి: ఇక ఈ బాధ్యత.. అల్లుడిదే..!

image

ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు హస్తినమడుగు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. మర్రిచెట్టుపై గంగా జలాన్ని భద్రపరిచారు. కలశం (జారీతాలి) నేలపై జారి పడకుండా మహాపూజలు అయ్యే వరకు చెట్టుపై మెస్రం వంశానికి చెందిన అల్లుడే భద్రపరుస్తుంటారు. ఈనెల 15, 16, 18న మహాపూజ, 22న దర్బార్, 22న పెర్సపేన్ బాన్కక్ పూజలు నిర్వహించనున్నారు.