News March 8, 2025
నిర్మల్: చలి మంటకు సేద తీరుతున్న ఆవు

నిర్మల్ జిల్లా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉదయం, రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. చలికి తట్టుకోలేక మనుషులతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. బాసరలోని కొత్వాల్ గల్లీలో రోడ్డు పక్కన శనివారం ఉదయం చలి నుంచి కాపాడుకునేందుకు పలువురు చలిమంట వేసుకున్నారు. కాగా వారు అక్కడి నుంచి వెళ్లి పోగానే ఓ ఆవు మంట వద్ద సేదతీరింది.
Similar News
News January 13, 2026
ముంబైలో నయా దందా.. 30 వేలకే భారత పౌరసత్వం?

ముంబైలో అక్రమ వలసదారులపై NDTV కథనం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారికి కేవలం రూ.7 వేల నుంచి రూ.30 వేలకే బర్త్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి నకిలీ పత్రాలు అందుతున్నట్లు వెల్లడించింది. 61 ప్రాంతాల్లో 3,014 మందిని పరిశీలించగా వీరిలో 96% అక్రమంగా భారత్‌లోకి వచ్చిన ముస్లింలేనని తెలిపింది. ‘మాల్వాణి ప్యాటర్న్’ పేరుతో వీరంతా ఓటు బ్యాంకులుగా మారుతున్నారని పేర్కొంది.
News January 13, 2026
మిగిలిన భోగి పళ్లను ఏం చేయాలి?

భోగి పళ్లు పోసిన తర్వాత కింద పడిన పళ్లను పిల్లలు ఏరుకుంటారు. ఆ తర్వాత మిగిలిపోయిన పళ్లను బయట పడేయకూడదు. వాటిని శుభ్రం గోమాతలకు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పళ్లు వృధా కాకుండా ఉండటమే కాకుండా, పశువులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మన సంప్రదాయాల్లో జీవ కారుణ్యం కూడా భాగమని చెప్పడానికి ఇదో నిదర్శనం.
News January 13, 2026
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ శ్రావణి

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కోడి పందేలు, గుళ్ల ఆటలపై నిషేధం ఉందన్నారు. వాటి జోలికి దూరంగా ఉండాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


