News October 7, 2025
నిర్మల్: చెరువులో దూకి ఇద్దరు అన్నదమ్ముల మృతి

ఇద్దరు అన్నదమ్ములు చెరువులో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ బంగల్పేట్ చెరువులో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన నరేష్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తమ్ముడు నవీన్ కాపాడడానికి వెళ్లాడు. దీంతో ఇద్దరు చెరువులో మునిగిపోయి చనిపోయారు. జాలర్లు మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 23, 2026
నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.
News January 23, 2026
నేడే సెకండ్ T20.. అక్షర్ పటేల్, బుమ్రా దూరం!

నేడు రాయ్‌పూర్ వేదికగా IND-NZ మధ్య రెండో T20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ఇవాళ ఆడే పరిస్థితి కనిపించట్లేదు. అతని స్థానంలో కుల్దీప్ ఆడే ఛాన్సుంది. మరోవైపు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్‌లో భాగంగా బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షిత్‌కు అవకాశమివ్వొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అతనొస్తే బ్యాటింగ్ పరంగానూ కొంత బలం పెరుగుతుంది అంటున్నారు. రా.7గం.కు స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.
News January 23, 2026
తాడిపత్రిలో పొలిటికల్ టెన్షన్

సవాల్.. ప్రతి సవాల్‌తో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేతిరెడ్డి సవాల్ విసరగా మీ ఇంటి వద్దే సవాల్ స్వీకరిస్తామని టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు, జేసీ అభిమానులు నేడు ఎమ్మెల్యే అస్మిత్ ఇంటి వద్దకు తరలిరావాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.


