News May 7, 2025
నిర్మల్ జిల్లాలో 45డిగ్రీల టెంపరేచర్

సూర్యప్రతాపం కారణంగా ప్రజలు విలవిలాడుతున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం దస్తూరాబాద్ మండలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నర్సాపూర్ (జి), మమడ, పెంబి మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడదెబ్బ కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2026
BREAKING: కామారెడ్డిలో హంగ్.. కింగ్ మేకర్ BRS

కామారెడ్డి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మున్సిపాలిటీలోని మొత్తం 49 వార్డుల్లో కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్ 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ 25 సంఖ్య ఏ పార్టీకి రాలేదు. దీంతో 11 స్థానాలను దక్కించుకున్న బీఆర్ఎస్ కింగ్ మేకర్‌గా మారనుంది. వారు మద్దతు ఇస్తేనే ఛైర్మన్ ఎన్నికకు అవకాశాలు ఉన్నాయి.
News February 13, 2026
ఆటిజంకు చికిత్స ఇదే..

ప్రపంచంలోని ప్రతి 68 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం అంటారు. దీనికి చికిత్స లేదు కానీ చిన్న వయసునుంచే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల మార్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఉంటాయి. వీటితో పాటు తల్లిదండ్రులే శిక్షకులుగా మారాలని నిపుణులు సూచిస్తున్నారు.
News February 13, 2026
ఇంద్రకీలాద్రిపై శివరాత్రి శోభ

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసే ‘వధూవరుల అలంకరణ’ వేడుక శాస్త్రోక్తంగా, కన్నుల పండువగా జరిగింది. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ గాంధీ, ఈఓ శీనా నాయక్ ఈ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.


