News August 14, 2025
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 21వరకు బ్లడ్ డొనేషన్ క్యాంపులు

వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో రక్త సరఫరా కొరత తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా ఈనెల 15 నుంచి 21 వరకు బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. అత్యవసర పరిస్థితులు, తక్షణ సహాయం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేశామని, ప్రజలు 9100577132 ద్వారా సహాయాన్ని పొందవచ్చని సూచించారు.
Similar News
News March 12, 2026
జగిత్యాల: ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు జమ

జగిత్యాల జిల్లాలో 2024-25 సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు నేరుగా వారి ఖాతాలలో జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలోని 1,267 మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.1,95,93,935 జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా కింద నిధులు విడుదల చేసిందన్నారు.
News March 12, 2026
దేశం సంక్షోభంలో.. మోదీ టూర్‌లో: ఖర్గే

దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ తరుణంలో PM మోదీ ఎన్నికల టూర్ చేపడుతున్నారని విమర్శించారు. ‘దేశవ్యాప్తంగా LPG కొరత ఉంది. ప్రజలు క్యూలైన్లలో నిలబడుతున్నారు. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం దగ్గర మాత్రం సమాధానం లేదు. దౌత్యపరంగా విఫలమవడం చాలా తీవ్రమైన అంశం. ఎనర్జీ మిస్‌మేనేజ్‌మెంట్ ఫలితాన్ని 140 కోట్ల మంది అనుభవిస్తున్నారు’ అని ఖర్గే పోస్ట్ చేశారు.
News March 12, 2026
ఇంటర్ పూర్తయిందా?.. ఓ లుక్కేయండి!

<<19343753>>ఇంటర్<<>> పూర్తయినవారు రెగ్యులర్ కోర్సులకే పరిమితం కాకుండా క్రియేటివిటీతో కూడిన డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. క్రియేటివిటీ ఉన్నవారు డిజైన్ (NID/NIFT) కోర్సుల ద్వారా రాణించవచ్చు. పర్యాటక రంగం విస్తరిస్తుండటంతో హోటల్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటే AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీకి మంచి డిమాండ్ ఉంది.


