News August 13, 2025
నిర్మల్: ‘డ్రగ్స్ విక్రయిస్తున్నారా అయితే ఫిర్యాదు చేయండి’

నషాముక్త్ భారత్ అభియాన్ మాసోత్సవంలో బుధవారం డ్రగ్స్ వినియోగించమని, భారతదేశం కోసం కృషి చేస్తామని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ప్రతిజ్ఞ నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తులో పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ సూచించారు. ఎక్కడైనా, ఎవరైనా మాదకద్రవ్యాలు విక్రయించినా, వినియోగించినా ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలన్నారు.
Similar News
News March 16, 2026
NLG: రాజగోపాల్‌రెడ్డి రహస్య మీటింగ్ పెట్టారా?

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేగింది. రేవంత్ సర్కార్‌పై అసహనంతో ఉన్న మునుగోడు MLA రాజగోపాల్‌రెడ్డి ఒక రహస్య డిన్నర్ మీటింగ్ నిర్వహించారని, 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందగా అందులో నలుగురు వచ్చారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. అయితే రాజగోపాల్ రెడ్డి రహస్య మీటింగ్ పెట్టారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. దీనిపై MLA రాజగోపాల్ రెడ్డి స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
News March 16, 2026
NZB: ఫీజులు లక్షల్లో.. భోజనం నరకప్రాయం

ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు భోజనం విషయంలో నాణ్యత పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. మెనూ ప్రకారం బ్రేక్‌ఫాస్ట్ అందించకుండా, ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం తిండితో అనారోగ్యం పాలవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
News March 16, 2026
HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

నగరంలో వీకెండ్ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.


