News October 8, 2025

నిర్మల్: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో నిర్మల్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 18 జడ్పీటీసీ, 157 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News January 20, 2026

రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా?

image

ప్రతి ఒక్కరూ రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగాలనే నియమానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని డాక్టర్లు చెబుతున్నారు. నీటి అవసరం అనేది మనిషి బరువు, చేసే పని, ఉండే వాతావరణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అందరికీ ఒకే లెక్క సరిపోదని, మన శరీరానికి నీరు కావాలనిపించినప్పుడు ‘దాహం’ రూపంలో సంకేతం ఇస్తుందని వివరించారు. అందువల్ల దాహం వేయకపోయినా బలవంతంగా నీళ్లు తాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. SHARE IT

News January 20, 2026

BREAKING: భూపాలపల్లి: యాక్సిడెంట్.. ఇద్దరు దుర్మరణం

image

భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం కొయ్యూరు PS పరిధిలోని రుద్రారం పంచాయతీ పరిధి చిగురుపల్లి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. రెండు మోటార్ బైక్‌లపై ముగ్గురు కిషన్‌రావుపల్లికి వెళ్తున్నారు. ఒక బైక్ వేగంగా చెట్టును ఢీకొనగా ఇద్దరు కిందపడి మృతిచెందారు. మరొక యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స నిమిత్తం భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు.

News January 20, 2026

ఆ పాపాలే మీకు శాపాలు: కాకాణి

image

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆత్మకూరులో ఆయన మాట్లాడుతూ. కూటమి పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని చెప్పారు. జగనన్న తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న పాపాలు వారికి భవిష్యత్తులో శాపాలుగా మారుతాయని చెప్పారు. ఎంపీ గురుమూర్తి, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.