News September 12, 2025

నిర్మల్: ‘ప్రతిభను వెలికి తీసేందుకే కళా ఉత్సవ్’

image

చదువుతోపాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే కళా ఉత్సవ్ పోటీలను పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. శుక్రవారం నిర్మల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు హాజరై ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.

Similar News

News December 12, 2025

కరీంనగర్: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ విధానంలో పూర్తయింది. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సాధారణ పరిశీలకులు వెంకటేశ్వర్లు సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. అనంతరం ఆయన డీపీవో జగదీశ్వర్‌తో కలిసి బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.

News December 12, 2025

జనవరి 23 నుంచి విశాఖలో బీచ్ ఫెస్టివల్

image

జనవరి 23 నుంచి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశాఖను అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిపి విశాఖ ఉత్సవ్‌పై కమిటీ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తామన్నారు.

News December 12, 2025

T20ల్లో వరల్డ్ రికార్డ్.. ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు

image

T20I క్రికెట్‌లో 33ఏళ్ల బహ్రెయిన్ బౌలర్ అలీ దావూద్ ప్రపంచ రికార్డు సృష్టించారు. భూటాన్‌పై కేవలం 19 పరుగులే ఇచ్చి 7 వికెట్లు తీశారు. టీ20 చరిత్రలో ఇదే సెకండ్ బెస్ట్ స్టాట్స్. ఫస్ట్ ప్లేస్‌లో మలేషియాకు చెందిన స్యాజ్రుల్ ఇద్రుస్(7/8), మూడో స్థానంలో సింగపూర్‌ ప్లేయర్ హర్షా భరద్వాజ్(6/3), ఫోర్త్ ప్లేస్‌లో నైజీరియా బౌలర్ పీటర్ అహో(6/5), ఐదో స్థానంలో టీమ్ ఇండియా బౌలర్ దీపక్ చాహర్(6/7) ఉన్నారు.