News March 5, 2025

నిర్మల్: ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 6,571 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని డీఐఈఓ పరుశురాం తెలిపారు. వీరందరి కోసం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు.

Similar News

News February 16, 2026

MBNR: ఆదర్శం.. రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట

image

మహబూబ్‌నగర్ జిల్లా శేరిపల్లిలో మతాచారాలు, ఆడంబరాలకు భిన్నంగా రాజ్యాంగం సాక్షిగా వివాహం జరిగింది. రిబుకా, ఉదయ్ అనే నూతన జంట రాజ్యాంగంపై ప్రమాణం చేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ వినూత్న వేడుకలో తెలంగాణ విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు, రెండు కుటుంబాల సభ్యులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఆదర్శ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.

News February 16, 2026

మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ఇలా..

image

TG: ఇవాళ 7 కార్పొరేషన్ల మేయర్లు, 116 మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఉ.11 గంటలకు గెలిచినవారితో అధికారులు ప్రమాణం చేయిస్తారు. తర్వాత ఆయా పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. మిగతా సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు(MP,MLA,MLC) చేతులెత్తి మద్దతు తెలుపుతారు. 50 శాతానికిపైగా ఓట్లు వచ్చినవారిని విన్నర్‌గా ప్రకటిస్తారు. సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

News February 16, 2026

ఖమ్మం జిల్లాకు చేరిన 1339 టన్నుల యూరియా

image

ఖమ్మం జిల్లాకు 1339.06 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మానికి 739.06 టన్నులు, మహబూబాబాద్‌కు 300 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెంకు 200 టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 100 టన్నులు కేటాయించినట్లు చెప్పారు. రైల్వే వ్యాగన్‌ల ద్వారా వచ్చిన ఎరువును లారీల ద్వారా వివిధ కేంద్రాలు, పీఏసీఎస్‌లకు తరలించి పంపిణీ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు.