News November 19, 2025
నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 16, 2026
గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడి గెలుపు

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్ MH ‘జల్నా’ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,621 ఓట్ల మెజారిటీతో గెలిచారు. BJP సహా ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. 2018లో అరెస్టై, 2024 సెప్టెంబర్‌లో కర్ణాటక హైకోర్టు నుంచి పంగర్కర్ బెయిల్ పొందారు. గతంలో అవిభక్త శివసేనలో కార్పొరేటర్‌గా పనిచేశారు.
News January 16, 2026
గద్వాల్: మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో 2026- 2027 విద్యా సంవత్సరంలో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు.
News January 16, 2026
చనాక-కోరట ప్రాజెక్టు.. 51 వేల ఎకరాలకు సాగునీరు

దిగువ పెనుగంగపై తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దున చనాక-కోరట ప్రాజెక్టును నిర్మించారు. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని ప్రాజెక్టు పనులను మొదలుపెట్టారు. 0.98 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో ప్రాజెక్ట్, దాని సమీపంలో హత్తి ఘాట్ వద్ద పంపు హౌస్ నిర్మించారు. దీని ద్వారా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలలోని సుమారు 51 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.


