News November 19, 2025
నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 22, 2026
భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సింగ్‌భూమ్ జిల్లాలోని సరంద అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు మరణించారు.
News January 22, 2026
పుష్ప-3లో సల్మాన్ ఖాన్? సక్సెస్ అయితే..

పుష్ప-3 స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నట్లు యూనిట్ వర్గాలు హింట్ ఇచ్చాయి. ఈ మూవీ 2 పార్ట్‌లు సాధించిన సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకొని ‘పుష్ప’ను ఓ యూనివర్స్‌లా మార్చే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు HYDలో ఆఫీస్ ఓపెన్ చేశారట. అందులో భాగంగా పుష్ప-3లో సల్మాన్ ఖాన్‌ను పవర్‌ఫుల్ రోల్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. సక్సెస్‌ను బట్టి ఆయనతో పుష్ప సిరీస్‌లో ప్రత్యేక సినిమా ఉండొచ్చని టాక్.
News January 22, 2026
ICOC చిత్తూరు ఛైర్మన్‌గా మనోజ్

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MSME) చిత్తూరు జిల్లా ఛైర్మన్‌గా చంద్రగిరి మనోజ్ కుమార్ నియమితులయ్యారు. రొంపిచర్ల(M) చంచంరెడ్డిగారిపల్లికి చెందిన ఈయన్ను BC కోటాలో నియమిస్తూ నేషనల్ జాయింట్ సెక్రటరీ సీమా కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోSC, ST, మహిళా అభ్యున్నతికి, పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు పాటుపడతానని మనోజ్ పేర్కొన్నారు.


