News November 19, 2025
నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 22, 2026
సన్ గ్లాసెస్‌తో మాక్రాన్.. కారణమదేనా?

దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ సన్‌గ్లాసెస్ ధరించడం చర్చనీయాంశమైంది. కంటి సమస్య(రక్తం గడ్డకట్టడం) వల్లే ఆయన గ్లాసెస్ ధరించారని ఫ్రెంచ్ మీడియా చెబుతుండగా తగ్గేదేలే అంటూ ట్రంప్‌నకు ఆయన మెసేజ్ ఇచ్చారేమోనని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. తాజాగా <<18905776>>ట్రంప్<<>> దీనిపై WEFలో మాట్లాడుతూ ‘మాక్రాన్ బ్యూటిఫుల్ గ్లాసెస్ ధరించి కనిపించారు. అసలేం జరిగింది?’ అని వెటకారంగా అన్నారు.
News January 22, 2026
మధిర: ‘కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే కమ్యూనిజం ప్రధాన లక్ష్యం’

మధిర పట్టణంలో నిర్వహించిన సీపీఎం నేత కట్టా గాంధీ సంస్మరణ సభలో బుధవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలు, కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే కమ్యూనిజం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, మహిళలు, యువత సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు.
News January 22, 2026
భారత ప్లేయర్‌కు గాయం

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డారు. 16వ ఓవర్లో మిచెల్ కొట్టిన బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయన వేలికి గాయమైంది. చేతి నుంచి రక్తం రావడంతో నొప్పితో మైదానాన్ని వీడారు. గాయం తీవ్రత ఎక్కువైతే తర్వాతి మ్యాచుల్లో అక్షర్ ఆడేది అనుమానమే.


