News February 26, 2025
నిర్మల్: రంజాన్ శాంతియుతంగా జరుపుకోవాలి: ASP

శాంతియుత వాతావరణంలో రంజాన్ పండగను నిర్వహించుకోవాలని ఏఎస్పీ రాజేష్ మీనా అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసంలో అందరూ సంయమనంతో శాంతియుతంగా అందరూ కలిసి అన్నదమ్ముళ్ల మాదిరిగా మెలగాలని సూచించారు. ఎలాంటి ఘర్షణలు, గొడవలు జరగకుండా మత పెద్దలు చర్యలు చేపట్టాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులను చేయరాదన్నారు.
Similar News
News March 23, 2025
కడప జడ్పీ ఛైర్మన్.. వైసీపీకే ఖాయం

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ మరోసారి YCPకి వచ్చే అవకాశం ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ కాగా, నేడు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో 50 మంది జడ్పీటీసీలు ఉండగా, గత ఎన్నికల్లో YCP 49, TDP ఒక్కస్థానం గెలిచింది. ఇందులో ఒకరు చనిపోగా, TDPలోకి ఐదుగురు వెళ్లారు. అయినా YCP 42 స్థానాలతో ఆత్మవిశ్వాసంతో ఉంది. YCP నుంచి బి.మఠంకు చెందిన రామగోవిందురెడ్డి ఛైర్మన్‌కు ముందు వరుసలో ఉన్నారు.
News March 23, 2025
ధోనీ రిటైర్మెంట్‌పై CSK కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

MS ధోనీ మరి కొన్నేళ్లు ఆడతారా? ఈ ప్రశ్నకు CSK కెప్టెన్ రుతురాజ్ ఆసక్తికర జవాబిచ్చారు. ‘51ఏళ్ల వయసులోనూ సచిన్ మాస్టర్స్ లీగ్‌లో ఎలా ఆడారో చూశాం. కాబట్టి ధోనీలో ఇంకా చాలా ఏళ్ల ఆట మిగిలి ఉందనుకుంటున్నా. 43 ఏళ్ల వయసులోనూ ఆయన జట్టుకోసం పడే కష్టం మా అందరికీ స్ఫూర్తినిస్తుంటుంది. జట్టులో తన పాత్రకు అనుగుణంగా వీలైనన్ని సిక్సులు కొట్టడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
News March 23, 2025
ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ. 185 ఉండగా, స్కిన్ లెస్ కేజీ రూ.210 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 130 మధ్య ఉంది. కాగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.