News September 11, 2025

నిర్మల్ రూరల్: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: మంత్రి

image

మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వా లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.

Similar News

News December 5, 2025

వారంలో 100 టన్నులు అమ్మేశారు..

image

వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో దేశవ్యాప్తంగా ప్రజలు దీనిని ‘క్యాష్’ చేసుకున్నారు. ఇంట్లో ఉండే వెండిని భారీగా అమ్మేశారు. కేవలం వారంలోనే సుమారు 100 టన్నుల పాత వెండి మార్కెట్‌కు వచ్చినట్లు IBJA అంచనా వేసింది. సాధారణంగా నెలకు 10-15 టన్నులు మార్కెట్‌కు వచ్చేది. KG వెండి ధర రూ.1.90,000కు చేరుకోవడంతో లాభాల కోసం కుటుంబాలు దుకాణాలకు క్యూ కట్టాయి. పెళ్లిళ్లు, పండుగలు, ఖర్చులు కూడా అమ్మకాలకు ఓ కారణం.

News December 5, 2025

నెల్లూరు: 2.94 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలే లక్ష్యం.!

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 21వ తేదీన పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న 2,94,140 మంది చిన్నారులకు ఈ చుక్కల మందును వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 52 PHC, 28 UPHCల పరిధిలో 80 కేంద్రాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు.

News December 5, 2025

వరి కోయ కాలు కాల్చితే భూమి నిర్వీర్యం: DAO

image

PDPL వ్యవసాయశాఖ రైతులకు కీలక సూచనలు జారీ చేసింది. వరి కోయ కాలు కాల్చడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి భూమి నిర్వీర్యమై పంట దిగుబడి తగ్గిపోతుందని DAO శ్రీనివాస్ స్పష్టం చేశారు. పంటావశేషాలను కాల్చకుండా సూపర్ పాస్ఫేట్‌ చల్లి నీరు పెట్టి దున్నితే సేంద్రియ పదార్థం పెరిగి ఎరువుల ఖర్చు తగ్గి, పంటల ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు. రైతులు ఈ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.