News December 2, 2025

నిర్మల్: రెండో రోజు 281 నామినేషన్లు

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత నామినేషన్ల ప్రక్రియలో సోమవారం 7 మండలాల్లో 281 సర్పంచ్ నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారంతో కలిపి మొత్తం 400 సర్పంచ్ నామినేషన్లు వచ్చాయి. సోమవారం 703 వార్డు మెంబర్ల నామినేషన్లు రాగా, ఆదివారంతో కలిసి మొత్తం 825 వార్డు మెంబర్ నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News February 7, 2026

సకల దోష నివారణ మార్గం ‘సూర్య గ్రహ శాంతి’

image

జాతకంలో సూర్య దోషాలు ఉన్నవారు, సూర్య మహాదశ నడుస్తున్న వారు భాను సప్తమి నాడు సూర్య గ్రహ శాంతి పూజ, యజ్ఞం నిర్వహించడం శుభప్రదం. సూర్యుడు జాతకంలో ఆత్మకారకుడు, అధికారానికి చిహ్నం. ఈ రోజున చేసే జపం, హోమం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగి, సమాజంలో గౌరవం, వృత్తిలో విజయం లభిస్తాయి. ఈ హోమంలో పాల్గొనడం ద్వారా జాతకంలోని రవి నీచ స్థితి, గ్రహణ దోషాలు హరించుకుపోతాయి. జీవితంలో కొత్త వెలుగులు నిండుతాయి.

News February 7, 2026

జామలో తెల్ల సుడిదోమ వల్ల నష్టాలు – నివారణ

image

తెల్ల సుడిదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గుడ్లను పెడతాయి. ఆకులపై తెల్లని దూదిలాంటి మెత్తని పదార్ధాన్ని కప్పి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులు ఎర్రబడి, ముడతలు పడి రాలిపోతాయి. వీటి నివారణకు రాత్రివేళ పసుపు రంగు జిగురు పూసిన అట్టలను చెట్ల వద్ద ఉంచాలి. సుడిదోమ ఆశించిన కొమ్మలను కత్తిరించి లీటరు నీటిలో 5ml వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్-75% WGని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News February 7, 2026

క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన

image

AP: అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి CM చంద్రబాబు ఇవాళ 3PMకు ఉద్దండరాయునిపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశంలోనే తొలి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్‌ను అమరావతికి తీసుకొచ్చేందుకు IBM, TCS, L&T సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.