News August 20, 2025
నిర్మల్: రేపు జాబ్ మేళా

జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21న నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి గోవింద్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఎస్బిఐ లైఫ్ విభాగంలో 20 ఆర్థిక సలహాదారులు, పేటీఎం సర్వీసెస్ లిమిటెడ్ లో 50 ఫీల్డ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులై 18-45 మధ్య వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.
Similar News
News January 17, 2026
వనపర్తి: భార్య చేతిలో భర్త దారుణ హత్య

గోపాల్‌పేట మండల పరిధిలోని ఏదుట్లలో అనుమానంతో వేధిస్తున్నాడన్న కోపంతో భార్య తన భర్తను హతమార్చిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నమల్లయ్య (40), శివమ్మ దంపతుల మధ్య వివాహేతర విషయమై తరచూ గొడవలు జరుగుతుండేవి. నిన్న రాత్రి మరోసారి గొడవ ముదరడంతో శివమ్మ ఆవేశంలో పారతో తలపై బలంగా కొట్టింది. అక్కడికక్కడే మృతి చెందాడు. వనపర్తి DSP, CI ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
News January 17, 2026
కాకినాడలో జాబ్ మేళా.. ఎప్పుడంటే..!

కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం వద్ద ఈ నెల 19న సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ PD లచ్చారావు శనివారం తెలిపారు. పదో తరగతి నుంచి ఆపై విద్యార్హతలు కలిగి, 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ ధ్రువీకరణ పత్రాలతో సోమవారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 17, 2026
గొల్లప్రోలులో కోర్టు సినిమా హీరోయిన్ సందడి

గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని ప్రసిద్ధ అపర్ణాదేవి ఆలయాన్ని శనివారం కోర్టు సినిమా ఫేమ్ శ్రీదేవి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు ఆకొండి ప్రభాకర్ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆమె కుంకుమ పూజలు చేశారు. పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు హీరోయిన్‌ను ఘనంగా సత్కరించారు. శ్రీదేవి రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.


