News August 12, 2025
నిర్మల్: రేపు మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బుధవారం ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించాలని ఇన్‌ఛార్జి జిల్లా విద్యాధికారి ముడారపు పరమేశ్వర్ సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు, మాదకద్రవ్యాల నిరోధకానికి సంబంధించి ఈ నెలను ప్రత్యేక మాసంగా ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
Similar News
News March 9, 2026
BREAKING: శుభవార్త చెప్పిన ప్రభుత్వం

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్యాస్ ధరల <<19316911>>పెరుగుదలతో<<>> ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట లభించనుంది.
News March 9, 2026
వచ్చిన నీరు వచ్చినట్టే పాయే.. గొంతు ఎండనుందా!

ఈ ఏడాది వేసవి కాలం జిల్లా ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆశాజనకంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెల నుంచి జూన్ వరకు తాగునీటి అవసరాలకే సుమారు 65.49 టీఎంసీలు అవసరం కాగా, నిల్వలు మాత్రం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి.
News March 9, 2026
కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.


