News November 8, 2025

నిర్మల్: రేపు హజ్ యాత్రికులకు శిక్షణ

image

హజ్ యాత్రకు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం ఖాదిముల్ హుజ్జాజ్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంఘ బాధ్యులు షేక్ హయత్, అబ్దుల్ రెహ్మాన్, ఫెరోజ్ ఖాన్ తెలిపారు. నిర్మల్‌లోని ఐఏ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, 2026లో యాత్రకు వెళ్లేవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News January 15, 2026

ఎర్రవెల్లి నివాసంలో KCR సంక్రాంతి వేడుకలు

image

TG: ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. కుమారుడు కేటీఆర్ కూడా ఫ్యామిలీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫాంహౌజ్‌లో రంగు రంగుల ముగ్గు ముందు కేసీఆర్‌తో కలిసి దిగిన ఫొటోలను KTR Xలో షేర్ చేశారు. తమ కుటుంబసభ్యుల తరఫున రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సంక్రాంతి విషెస్ చెప్పారు.

News January 15, 2026

గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

image

సీఎం రేవంత్ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, MBNR ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం కలిశారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యల గురించి చర్చించినట్లు సమాచారం.

News January 15, 2026

77వ రిపబ్లిక్ డే వేడుకలకు గెస్టులు వీరే

image

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు గెస్టుల పేర్లను కేంద్రం ప్రకటించింది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా(పోర్చుగల్), యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (జర్మనీ) రానున్నట్లు తెలిపింది. వేడుకల అనంతరం వీరు ఈనెల 27న PM మోదీతో ట్రేడ్ డీల్‌పై చర్చించనున్నారు. కాగా ఈ నెలాఖరున EUతో భారత్ ట్రేడ్ డీల్ సైన్ చేసే అవకాశముందని ట్రేడ్&కామర్స్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు.