News September 12, 2025
నిర్మల్: సబ్ కలెక్టర్‌కు పాలజ్ గణేశుని లడ్డు

మహారాష్ట్రలోని సుప్రసిద్ధ పాలజ్ కర్ర వినాయకుని మహిమాన్విత లడ్డు ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకున్న కుబీర్ మండలానికి చెందిన డాక్టర్ సాప పండరి గురువారం భైంసా సబ్ కలెక్టర్ అజ్మేరా సాంకేత్ కుమార్ను కలిసి అందజేశారు. అనంతరం డాక్టర్ పండరి మాట్లాడుతూ.. కుబీర్ మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు.
Similar News
News December 7, 2025
అనంతపురంలో అన్నదమ్ములు మృతి..!

ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి అన్నదమ్ములు నరేంద్ర(32), చరణ్(25) మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బ్రహ్మసముద్రం మండలానికి చెందిన చరణ్ కాలు జారి నీటికుంటలో పడ్డాడు. అన్న నరేంద్ర అతణ్ని కాపాడేందుకు నీటి కుంటలోకి దూకాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
News December 7, 2025
ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్టే!

* పాదాలు తిమ్మిరిగా లేదా మండుతున్నట్టుగా అనిపిస్తుంది
* ఉన్నట్టుండి బాడీకి షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది.
* పని మీద శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడతారు.
* అన్ని సమయాలలోనూ అలసిపోయిన భావన కలుగుతుంది.
* చిన్న విషయాలను కూడా పదే పదే మర్చిపోతుంటారు.
* మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లు బలహీనంగా అనిపిస్తాయి.
News December 7, 2025
రేపు ‘నన్నయ్య’కు మాజీ ఉపరాష్ట్రపతి

ఆదికవి నన్నయ వర్సిటీలో 8, 9 తేదీల్లో “భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం”పై జాతీయ కార్యశాల జరగనుంది. కేంద్ర విద్యాశాఖ, భారతీయ భాషా సమితి సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శాస్త్రీయ పదజాలాన్ని ప్రాంతీయ భాషల్లోకి సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.


