News April 14, 2025

నిర్మల్: హోటల్లోకి దూసుకెళ్లిన కారు

image

హోటల్లోకి కారు దూసుకెళ్లిన ఘటన ఆదివారం అర్ధరాత్రి నిర్మల్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని సోపి నగర్‌లోని ఓ హోటల్‌లోకి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి దూసుకు వెళ్లింది. దీంతో హోటల్‌లోని సామాగ్రి పూర్తిగా ధ్వంసం అయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 18, 2026

ఖమ్మం: పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

image

ఈనెల 23, 24, 25న ఖమ్మంలో జరిగే PDSU రాష్ట్ర 23వ మహాసభల విజయవంతానికై రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ యాజమాన్యాలకు అప్పగించి విద్యావ్యవస్థను పూర్తిగా వ్యాపారమయం చేశారని విమర్శించారు.

News January 18, 2026

విశాఖలో ప్రముఖ వైద్యుడి మృతి

image

వేలాది పోలియో, వికలాంగ బాధితులకు జీవితాల్లో వెలుగులు నింపిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదినారాయణరావు(85) శనివారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ప్రేమ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగా 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన సుమారు 3లక్షల శస్త్ర చికిత్సలు చేశారు. పోలియో బాధితులకు చేసిన సేవలకుగాను 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన మృతికి వైద్య, ప్రజావర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.

News January 18, 2026

రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

image

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.