News August 12, 2025

నిర్మల్: 124 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు

image

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరమని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోని డీసీసీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్మల్ నియోజకవర్గంలోని 124 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు.

Similar News

News March 9, 2026

ఆదిలాబాద్: పలువురు తహశీల్దార్‌లకు స్థానచలనం

image

ముగ్గురు తహశీల్దార్లు, నలుగురు నాయబ్ తహశీల్దార్లకు స్థానచలనం కలిగింది. మండలాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. భీంపూర్ తహశీల్దార్ నలంద ప్రియను కలెక్టర్ కార్యాలయ హెచ్-విభాగం సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఉట్నూర్ తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ బేలకు స్థానచలనం కల్పించారు. కలెక్టర్ కార్యాలయం-హెచ్ సూపరింటెండెంట్ పంచపూలను డీ విభాగానికి వెళ్లారు.

News March 9, 2026

బేర్ పంజా.. సెన్సెక్స్ 2వేల పాయింట్లు క్రాష్!

image

యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్ ఈరోజు స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. సెన్సెక్స్ 2341 పాయింట్లు కోల్పోయి 76,605కు చేరగా.. నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోయి 23,741 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ సూచీలో అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. రూపాయి విలువ సైతం జీవితకాల కనిష్ఠానికి చేరింది. ఒక డాలరుకు 92.30గా ఉంది. FII అమ్మకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.

News March 9, 2026

కాకినాడ: కొండల్లో రక్తపుమడుగులో బాలుడి మృతదేహం

image

అనకాపల్లి(D) ఏటికొప్పాక వరాహనది సమీపంలో రక్తపుమడుగులో <<19331621>>బాలుడు కౌసిక్ <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. CI ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించి బాలుడి శరీరంపై లోతైన గాయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తోటి బాలురను విచారించారు. కాకినాడ(D) తునికి చెందిన కౌశిక్ ఏటికొప్పాకలో మేనమామల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. కౌశిక్ తండ్రి ఇటీవల మృతిచెందడం గమనార్హం.