News August 20, 2025

నిర్మల్: 22 నుంచి పనుల జాతర-2025 ప్రారంభం

image

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ నెల 22 నుంచి పనుల జాతర–2025 ప్రారంభించనున్నట్లు డీఆర్‌డీవో విజయలక్ష్మి తెలిపారు. పనుల జాతరలో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో మరింత అంకితభావంతో ప్రజలను భాగస్వామ్యం చేయడమే పనుల జాతర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పని కల్పించడానికి పనుల జాతర ఉపయోగపడుతుందని తెలిపారు.

Similar News

News January 21, 2026

నంద్యాల చిన్నారి ప్రపంచ ఘనత

image

నంద్యాల జిల్లా నెరవాటి స్కూల్‌కు చెందిన మూడో తరగతి విద్యార్థిని కె.నాగసారిక వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె నాగసారికను సత్కరించారు. 28 సెకన్లలో 100 హిందీ పదాలను వేగంగా ఉచ్చరించి ఈ రికార్డు నెలకొల్పినట్లు వివరించారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణమని, పాఠశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని ఆమె అభినందించారు.

News January 21, 2026

సిద్దిపేట ఈనెల 22న డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జనవరి 22న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ. సునీత తెలిపారు. ఇంటర్,డిగ్రీ అర్హత తో ఈ జాబ్స్ ఉంటాయన్నారు. జాబ్ మేళాలో మొత్తం 7 కంపెనీలు ఉన్నాయన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

News January 21, 2026

నవీన్ పొలిశెట్టి కండిషన్స్ నిజమేనా?

image

హీరో నవీన్‌‌ పొలిశెట్టికి సంబంధించి ఓ వార్త వైరలవుతోంది. అదేంటంటే ఆయన కొత్తగా 2 కండిషన్స్ పెడుతున్నారంట. ‘ఒకటి రూ.15 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలి. రెండోది మూవీ మొత్తం తానే చూసుకుంటారు’ అని అంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే నిర్మాత మూవీకి సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. బడ్జెట్ ఇస్తే ఆఖర్లో ఫస్ట్ కాపీ చూపిస్తారు. అయితే ఈ ప్రచారాల్లో నిజమెంత అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.